అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్ పర్యటనపై అసంబద్ధ వ్యాఖ్యలు మాని.. జిల్లా రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని కళ్యాణదుర్గం తెదేపా సమన్వయకర్త ఉమామహేశ్వరనాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు బిగింపు పై పక్క రాష్ట్ర నాయకులు అవహేళనగా మాట్లాడుతున్నారన్న విషయాన్ని...వైకపా నాయకులు గుర్తెరగాలి తెలిపారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగింపు కార్యక్రమం మొదలు పెడితే రైతుల సహకారంతో.. తాము ఉద్యమాలు చేపడతామని అన్నారు. లోకేశ్ పర్యటనపై జిల్లాకు చెందిన మంత్రి అవహేళనగా మాట్లాడటం సరికాదన్నారు. విమర్శించడంమాని.. నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆర్థికంగా ఆదుకోవాలని ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు.
అసంబద్ధ వ్యాఖ్యలు మాని రైతులను ఆదుకోండి: ఉమామహేశ్వరనాయుడు - తెదేపా సమన్వయకర్త ఉమామహేశ్వరనాయుడు తాజా వార్తలు
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్ పర్యటన పై ..వైకాపా నాయకులు విమర్శించడం మాని రైతులను ఆదుకోవాలని తెదేపా నేత ఉమామహేశ్వరనాయుడు అన్నారు. విద్యుత్ మీటర్లపై వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లాలని చూస్తోందన్నారు.
tdp leader comments
TAGGED:
అనంతపరం జిల్లా తాజా వార్తలు