తెదేపాను లక్ష్యంగా చేసుకొని అధికార వైకాపా దాడులకు దిగుతోందని తెదేపా నేత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఆరోపించారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల కాలంలో బీసీ, ఎస్సీ ఎస్టీలపై అనేక దాడులు చేశారని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటిదాకా 650 మంది తెదేపా నాయకుల పై దాడులు చేసిన పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ దాడులపై ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని లేనిపక్షంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి..ఉద్యమిస్తామని హెచ్చరించారు.
'ప్రతిపక్ష పార్టీలే లక్ష్యంగా అధికార పార్టీ దాడులు' - tdp former mp nimmala kistappa conference at anantapur
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీలనే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని తెదేపా నేత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప మండిపడ్డారు.
తెదేపా పార్టీ కార్యాలయంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప