ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 30, 2019, 12:12 PM IST

Updated : Oct 30, 2019, 4:26 PM IST

ETV Bharat / state

మాజీ ఎంపీ జేసీ దివాకర్​రెడ్డి అరెస్ట్

మాజీఎంపీ, తెదేపా నేత జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా వెంకటాపురంలో తెదేపా నేత ఇంటి ముందు వైకాపా నాయకులు బండలు పెట్టిన చర్యపై... ఆరా తీసేందుకు వెళ్తుండగా జేసీని అదుపులోకి తీసుకున్నారు.

మాజీ ఎంపీ జేసీ దివాకర్​రెడ్డి అరెస్ట్

మాజీ ఎంపీ జేసీ దివాకర్​రెడ్డి అరెస్ట్

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంకటాపురం గ్రామంలో తెదేపా నేత ఇంటికి అడ్డుగా వైకాపా నాయకులు బండలు నాటిన విషయంపై... అరా తీసేందుకు జేసీ దివాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యామిని బాల, బీటీ. నాయుడు ఆ గ్రామానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఠాణాకు తరలించారు. పోలీసులు తెదేపా నేతలను అడ్డుకోవడం కారణంగా... అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైకాపా నేతల తీరును జేసీ దివాకర్ రెడ్డితో పాటు... తెదేపా నేతలు తీవ్రంగా తప్పుపట్టారు.

Last Updated : Oct 30, 2019, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details