"నా ఇల్లు నా సొంతం-నా స్థలం నాకు కావాలి"అంటూ అనంతపురం జిల్లా గుంతకల్లులో... తెదేపా శ్రేణులు ఆందోళన బాట పట్టారు. పట్టణంలోని దోనిముక్కల రోడ్డులో తెదేపా ప్రభుత్వం... నిరాశ్రయులైన నిరు పేదలకు ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం కింద 2018లో 331.41 కోట్లతో 4719 ఇళ్లను నిర్మించడానికి "శపూర్జి పళ్లం జీ" అనే కంపెనీకి ఒప్పందం ఇచ్చింది. దీని కోసం అనుమతులు మంజూరు చేసిన లబ్ధిదారులు నుంచి రూ.500 నుంచి 50వేల వరకు డీడీల రూపంలో మున్సిపాలిటీ అధికారులు డబ్బులు వసూలు చేశారు.
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. గత సంస్థకు ఒప్పందం రద్దు చేసి కొంత సంస్థకు పనులు అప్పగించారు. అంతే కాకుండా తెదేపా హయంలో పేదలకు కేటాయించిన ఇళ్లను... ఇతరులకు ఇవ్వడంతో బాధితులు పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు.
ఆశతో అప్పుచేసి పునాదులు వేసుకున్నాం
ప్రస్తుత వైకాపా ప్రభుత్వ నాయకులు తమ ఇళ్లను కూల్చి, తమ స్థలాల్లో వారి అమాన్యులకు ఇళ్లను నిర్మిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇల్లు వస్తుందని ఆశతో అప్పు చేసి పునాదులు వేసుకున్న తమ ఇళ్లను... రాత్రికి రాత్రే కూల్చి వేస్తున్నారని బాధితులు వాపోయారు.