అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని తెదేపా కార్యాలయం వద్ద సందడి నెలకొంది. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులను అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆదివారం ప్రకటించారు. అనంతరం.. కాలువ శ్రీనివాసులు అనుచరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాయదుర్గంలోని పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
రాయదుర్గంలో తెదేపా శ్రేణుల సంబరాలు - anantapur parliament tdp incharge news
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని తెదేపా కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అనంతపురం పార్లమెంటరీ తెదేపా ఇన్‌ఛార్జిగా కాలువ శ్రీనివాసులు నియామకంపై హర్షం వ్యక్తం చేశారు.
Tdp followers celebrated in rayadurgam town