అనంతపురం జిల్లా ధర్మవరంలో తెదేపా కార్యకర్త కిడ్నాప్ కలకలం రేపింది. తమ్మిశెట్టి అమర్నాథ్ అనే యువకుడిని కొందర వ్యక్తులు అపహరణకు యత్నించారు.
ఇదీ విషయం...
ఇంటి వద్ద ఉన్న అమర్నాథ్ను స్నేహితుడు అంజితో ఫోన్ చేయించి రాజేంద్రనగర్‌కు రప్పించారు. అప్పటికే అక్కడ ఉన్న నిందితులు వన్నూరు సాబ్... అతని స్నేహితులు ద్విచక్రవాహనంలో తీసుకెళ్లారు. అనంతరం పోతుకుంట వద్ద అమర్నాథ్పై దాడికి దిగారు. ఎన్నికల్లో తెదేపా ఏజెంట్‌గా ఉన్న కారణంగా 5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని బాధితుడు ఆరోపించాడు. అక్కడి నుంచి తప్పించుకున్న అమర్నాథ్ ధర్మవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. జరిగిన విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు చరవాణి ద్వారా వివరించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
'ధర్మవరంలో తెదేపా కార్యకర్త అపహరణ' - ycp
ధర్మవరంలో తెదేపా కార్యకర్తను దుండగులు పట్టపగలే అపహరించారు. తప్పించుకున్న యువకుడు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తెదేపా ఏజెంట్‌గా ఉన్నందునే కక్ష సాధింపులకు దిగుతున్నారని బాధితుడు ఆరోపించాడు.
'కలకలం సృష్టిస్తోన్న తెదేపా కార్యకర్త కిడ్నాప్'