ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు'

వచ్చే ఎన్నికల్లో తమ కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చెప్పారు.

By

Published : Mar 22, 2021, 8:25 PM IST

Tdp ex mla Prabhakar chowdary
మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి

ఎన్నికల్లో ఓటమి చూసి నిరుత్సాహపడకుండా రానున్న ఎన్నికల్లో ఉత్సాహంగా పని చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చెప్పారు. అధికార పార్టీ బెదిరింపులు, దౌర్జనాలతో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకొని ఆధిపత్యం సాధించారని ఆరోపించారు.

ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఇప్పటి నుంచే సేవా భావంతో పని చేయాలని కార్యకర్తలకు సూచిస్తామన్నారు. అధికార పార్టీ లోపాలను ప్రజలకు తెలియజేయడానికి తమ కార్యకర్తలు అందుబాటులో ఉంటారని.. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్న భరోసా కల్పిస్తామని ఆయన చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details