ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అధికారులూ మారండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి' - జితేంద్ర గౌడ్ ఆవేదన న్యూస్

అనంతపురం జిల్లా గుంతకల్లులోని నెలగొండలో జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో హైడ్రామా నెలకొంది. మొదట ఓ అభ్యర్థి గెలిచారని ప్రకటించి.. అనంతరం మరో అభ్యర్థిని విజేతగా తేల్చడంపై తెదేపా నేత జితేంద్ర గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.

tdp-ex-mla-jitendra-gowd-fire-on-police-in-guntakallu-constituency-of-anantapur-district
'అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారు'

By

Published : Feb 18, 2021, 5:56 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నెలగొండలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో... అభ్యర్థి విజయంపై అయోమయం నెలకొంది. తొలుత తెదేపా మద్దతుదారు అభ్యర్థి గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అనంతరం 2 ఓట్ల తేడాతో... వైకాపా బలపరిచిన వ్యక్తిని విజేతగా ప్రకటించారు. ఈ వ్యవహారంపై.. తెదేపా మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

వైకాపా ప్రభుత్వానికి పోలీసులు, అధికారులు తొత్తులుగా మారారని జితేంద్ర గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే రాబోయే తరాల భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని అన్నారు. అధికారులు.. ఇప్పటికైనా ప్రభుత్వానికి అనుకూలంగా పని చేయడం మాని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details