ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్న క్యాంటీన్లు తెరవాలి: ప్రభాకర్ చౌదరి - అనంతపురం మాజీ ఎమ్మెల్యే నిరాహార దీక్ష

లాక్​డౌన్​తో పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు రూ.5 వేలు ఆర్థిక సాయం అందించాలని అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయలతో పేదల అవసరాలు తీరవన్నారు.

ప్రభాకర్ చౌదరి
ప్రభాకర్ చౌదరి

By

Published : Apr 15, 2020, 4:24 PM IST

12 గంటల నిరాహార దీక్ష చేపట్టిన తెదేపా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి

లాక్​డౌన్​తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు రూ.5 వేలు ఇవ్వాలన్న డిమాండ్​తో అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. నగరంలోని ఆయన స్వగృహంలో ఇవాళ ఉదయం దీక్షకు దిగారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు తెదేపా నాయకులు దీక్షలో పాల్గొన్నారు. లాక్​డౌన్ కారణంగా ప్రజలు కష్టాల్లో ఉన్నారని.. వారికి ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయలు ఏమాత్రం సరిపోవని చెప్పారు. పేదలకు నగదు పంపిణీలో కొందరు వైకాపా నాయకులు పాల్గొంటూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మూసివేసిన అన్న క్యాంటీన్లు తెరిచి పేదల ఆకలి తీర్చాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details