ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయదుర్గంలో తేదేపా ఇంటింటి ప్రచారం - tdp ex minister kalava srinivasulu

మున్సిపల్ ఎన్నికల్లో తెదేపాకు ఓటేసి అభివృద్ధిని అందుకోవాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఓటర్లను కోరారు. రాయదుర్గంలో 16వ వార్డు అభ్యర్థి సంపత్ కుమారి తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

ex minister kalava srinivasulu
మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

By

Published : Mar 2, 2021, 1:56 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని 16 వ వార్డులో తెదేపా అభ్యర్థి సంపత్ కుమారి తరఫున.. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు.

స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఓటర్లను బెదిరిస్తున్నారని కాలవ ఆరోపించారు. రాయదుర్గం పట్టణంలోని విజ్ఞులైన ఓటర్లు అభివృద్ధిని కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details