లాక్ డౌన్ నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించిన శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, నాయకులపై చర్యలు తీసుకోవాలని బుక్కరాయసముద్రం సీఐ సాయిప్రసాద్‌కు తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు వినతిపత్రం అందజేశారు. శింగనమల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు చైర్మైన్ ప్రమాణస్వీకారోత్సవం అట్టహసంగా చేపట్టారని అన్నారు. లాక్ డౌన్ అమలవుతున్న వేళ శింగనమల ఎమ్మెల్యే, నాయకులు వందల సంఖ్యలో గుంపులు గుంపులుగా సామాజిక దూరం పాటించకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు.
'లాక్ డౌన్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలి' - leaders in lock down time
లాక్ డౌన్ నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించిన శింగనమల ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు వినతిపత్రం అందజేశారు. ప్రజలు ఎవరూ బయటకు రాకూడదని చెప్పిన ప్రజాప్రతినిధులే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బయట తిరగడం సరికాదన్నారు.
!['లాక్ డౌన్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలి' ananthapuram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7288601-514-7288601-1590065844303.jpg)
లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధం ప్రవర్తించిన ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలి
TAGGED:
ananthapuram district