అనంతపురం నగరపాలక సంస్థలో తెదేపా కార్పొరేటర్ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి విడుదల చేశారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రారంభం కావటంతో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌తో కలిసి ఇరు పార్టీల అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. అనంతపురంలో 50 డివిజన్లకు 45 డివిజన్లలో తెదేపా అభ్యర్థులు పోటీలో నిలుస్తుండగా, నాలుగు చోట్ల సీపీఐ, ఒకచోట ఇండియన్ ముస్లింగ్ లీగ్ అభ్యర్థిని పోటీలో నిలిపారు.
తెదేపా కార్పొరేటర్ అభ్యర్థుల జాబితా విడుదల - Municipal Elections in Anantapur latest updates
అనంతపురంలోని 50 డివిజన్లకు 45 డివిజన్లలో తెదేపా అభ్యర్థులు పోటీలో నిలుస్తుండగా, నాలుగు చోట్ల సీపీఐ, ఒకచోట ఇండియన్ ముస్లింగ్ లీగ్ అభ్యర్థిని పోటీలో నిలిపారు. నగరపాలక సంస్థలో తెదేపా, సీపీఐ కార్పొరేటర్ అభ్యర్థుల జాబితాను సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌తో కలిసి తెదేపా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి విడుదల చేశారు.
నగరంలోని అన్ని డివిజన్లలో తెదేపా అభ్యర్థులతో నామినేషన్లు వేయించగా, ఈ రెండు రోజుల్లో రెబల్ అభ్యర్థులు ఉపసంహరణ చేస్తారన్నారు. పార్టీ ఆదేశాలు ఖాతరు చేయనివారిపై కఠిన చర్యలుంటాయని చెప్పారు. తెదేపా కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపికలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశామని, బీసీలకు పెద్దపీట వేసినట్లు ప్రభాకర్ చౌదరి తెలిపారు. ఈసారి సీపీఐతో కలిసి నగరపాలకసంస్థ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. నగరంలో కార్పొరేటర్ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. కానీ ఎవరూ బెదిరే పరిస్థితుల్లో లేరున్నారు. వైకాపాకు తగిన బుద్ది చెబుతారని సీపీఐ జిల్లా నేత జగదీష్ హెచ్చరించారు.
ఇవీ చదవండి: గ్యాస్ ధరల పెంపుపై అనంతపురంలో వినూత్న నిరసన