ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాలంటీర్​ను కఠినంగా శిక్షించాలి: తెదేపా - అనంతపురం జిల్లా వార్తలు

అనంతపురం జిల్లా చిన్నమట్లగొందిలో గ్రామ వాలంటీర్​ చేతిలో అత్యాచార యత్నానికి గురైన బాలిక కుటుంబాన్ని తెదేపా నేతలు పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మహిళా ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో ఈ ఘటన జరిగినా.. ఎమ్మెల్యే బాధితుల్ని పరామర్శించకపోవటంపై తెదేపా నేతలు విమర్శలు చేశారు.

వాలంటీర్​ను కఠినంగా శిక్షించాలి : తెదేపా
వాలంటీర్​ను కఠినంగా శిక్షించాలి : తెదేపా

By

Published : Jun 5, 2020, 12:40 PM IST


అనంతపురం జిల్లా శింగనమల మండలం చిన్నమట్లగొంది గ్రామానికి చెందిన ఓ బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి యత్నించాడు. అత్యాచారయత్నానికి గురైన బాలిక కుటుంబాన్ని తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు పరామర్శించారు. పార్టీ తరుపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించాల్సిన వాలంటీర్లే.. ఆ ప్రజలపైనే తిరగబడుతున్నారని ఎంఎస్​ రాజు ఆరోపించారు. ఇంత ఘోర ఘటన జరిగినా... బాధితులను ఎమ్మెల్యే పరామర్శించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. వాలంటీర్​పై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details