ప్రభుత్వ దాష్టీకానికి గురైన వైద్యుడు సుధాకర్‌ను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. అనంతరం జిల్లా కళ్యాణదుర్గంలో స్థానిక తెదేపా నేతలు పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైద్యుడు సుధాకర్ వ్యవహారంలో న్యాయస్థానం తీర్పను వారు స్వాగతించారు. సుధాకర్ విషయంలో అనుచితంగా ప్రవర్తించిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. వైద్యుడిని వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని జిల్లా ఇన్చార్జ్ ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు.
'వైద్యుడు సుధాకర్‌ను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలి' - వైద్యుడు సుధాకర్‌ను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలి
డాక్టర్ సుధాకర్ విషయంలో అనుచితంగా ప్రవర్తించిన వారిని సస్పెండ్ చేయాలని తెదేపా డిమాండ్ చేసింది. వైద్యుడిని వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని కోరింది.
tdp comments