పురపాలక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో ఎన్నికల బరిలో పోటీ పడలేక వైకాపా అడ్డదారుల్లో ఏకగ్రీవాలు చేసుకుందని అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ విమర్శించారు. ధర్మవరం పురపాలక కార్యాలయంలో తెదేపా అభ్యర్థులకు సంబంధించిన బీ ఫారాలను ఆయన ఎన్నికల అధికారులకు అందజేశారు.
ధర్మవరంలో 40 స్థానాలు ఉండగా ఆరు చోట్ల తెదేపా అభ్యర్థుల నామినేషన్ పత్రాలు సరిగా లేవని అధికారులతో చెప్పించి ఏకగ్రీవం చేసుకున్నారన్నారు. మరో ఆరుగురిని భయాందోళనలకు గురి చేసి నామినేషన్ల ఉపసంహరించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు మంచిది కావన్నారు.