అమరావతికి మద్దతుగా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ శివారులోని అక్కమాంబ దేవాలయం నుంచి నగరంలోని ప్రధాన వీధుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు మాట్లాడారు. మండలిలో సెలక్ట్ కమిటీకి బిల్లును పంపడం ముఖ్యమంత్రి జీర్ణించుకోలేక మండలి రద్దుకు పూనుకున్నారని విమర్శించారు. ఈ పరిణామాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో సమాధానం చెబుతారని హెచ్చరించారు.
అమరావతికి మద్దతుగా కళ్యాణదుర్గంలో భారీ బైక్ ర్యాలీ - కళ్యాణదుర్గంలో తెదేపా బైక్ ర్యాలీ న్యూస్
అమరావతికి మద్దతుగా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మండలిలో సెలక్ట్ కమిటీకి బిల్లును పంపడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేక మండలి రద్దుకు పూనుకున్నారని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ విమర్శించారు.

అమరావతికి మద్దతుగా కళ్యాణదుర్గంలో భారీ బైక్ ర్యాలీ