అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి తెలుగుదేశం కార్యాలయంలో మాజీ మంత్రి పరిటాల సునీత నేతృత్వంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా నాయకుల ఆగడాలు మితిమీరాయని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారన్నారు. కార్యకర్తలెవరూ అధైర్యపడదొద్దని ఆమె సూచించారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేశామన్నారు. కానీ వైకాపా అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే దౌర్జన్యాలకు పాల్పడుతుందని మండిపడ్డారు.
కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దు : పరిటాల సునీత - paritala
వైకాపా నాయకుల దౌర్జన్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుందని మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ ఆగడాలపై కార్యకర్తలతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.
పరిటాల సునీత