ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓబులాపురం మైనింగ్ వ్యవహారం.. మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తా: టప్పాల్ శ్యామ్ ప్రసాద్ - రాజశేఖర్ రెడ్డి

Tappal Shyam Prasad: ఓబులాపురం మైనింగ్​కు సంబంధించిన గాలి జనార్దన్ రెడ్డి కేసులో ప్రధాన సాక్షి అయిన టప్పాల్ శ్యామ్ ప్రసాద్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. కాపు రామచంద్రారెడ్డి, గాలి లక్ష్మీ అరుణ, రాజశేఖర్ రెడ్డితో సహా.. మరి కొంతమందిని నిందితులుగా చేర్చాలని సుప్రీంకు వెళ్తానన్నారు. వీరిపై ఎమ్ఎమ్​డీఆర్ యాక్ట్ కింద శిక్ష పడేవిధంగా చర్యలు చేపట్టాలని కోర్టును కోరనున్నట్లు వెల్లడించారు.

Obulapuram case
Obulapuram case

By

Published : Nov 6, 2022, 8:40 PM IST

Obulapuram case: ఓబులాపురం మైనింగ్ వ్యవహారంలో మరికొంత మంది నిందితులుగా చేర్చాలని సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు గాలి జనార్దన్ రెడ్డి కేసులో ప్రధాన సాక్షి అయిన టప్పాల్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. కాపు రామచంద్రారెడ్డి, గాలి లక్ష్మీ అరుణ, రాజశేఖర్ రెడ్డితో సహా.. మరి కొంతమందిని నిందితులుగా చేర్చాలని సుప్రీంకు వెళ్తానన్నారు. అయితే నిందితులనుంచి తనకు ప్రాణహాని ఉందని వెల్లడించారు. తన భద్రత విషయంలో సీబీఐ ఎస్పీ కళ్యాణ చక్రవర్తి చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన తెలిపారు. వారంతా కేసులో భాగాస్వాములు కావడానికి గతంలో ఇంప్లీడ్ పిటిషన్ వేసినట్లు గుర్తు చేశారు. వీరిపై ఎమ్ఎమ్​డీఆర్ యాక్ట్ కింద శిక్ష పడేవిధంగా చర్యలు చేపట్టాలని కోర్టును కోరనున్నట్లు తెలిపారు. సీబీఐ పట్ల నమ్మకం ఉందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details