MLC Mohd. Iqbal: గ్రామానికి రోడ్డు వేస్తామన్న హామీ నెరవేర్చలేదంటూ అనంతపురం జిల్లా హిందూపురంలో వైకాపా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఇంటిని గ్రామస్థులు ముట్టడించారు. చిలమత్తూరు మండలం తమ్మినాయనపల్లి గ్రామానికి రోడ్డు వేస్తామంటూ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్... 8 నెలల క్రితం హామీ ఇచ్చారని గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పటికీ గ్రామానికి రోడ్డు వేయలేదని...రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థులు ఇంటికి చేరుకునే సమయానికి ఎమ్మెల్సీ లేకపోవడంతో ఇంటి ముందే బైఠాయించారు. సమస్య పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
ఎమ్మెల్సీ ఇల్లు ముట్టడి.. తమ గ్రామానికి రోడ్డు వేయించాలంటూ నిరసన - అనంతపురం జిల్లాలో హిందూపురంలో ఎమ్మెల్సీ ఇంటిని ముట్టడించిన గ్రామస్తులు
Besieged MLC Mohammad Iqbal house: ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని తమ్మినాయనపల్లి గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. వైకాపా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఇంటి ముందు నిరసనకు దిగారు. తమ గ్రామానికి రోడ్డు వేయకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
ఎమ్మెల్సీ ఇంటి ముట్టడి
Last Updated : Aug 3, 2022, 3:17 PM IST