Tamils Festival In Anantapur: అనంతపురం జిల్లా హిందూపురంలో స్థిరపడిన తమిళులు తమ ఆరాధ్య దైవమైన సుబ్రహ్మణ్య స్వామిని వినూత్నంగా పూడిస్తారు. ఒళ్లు గగుర్పొడిచేలా ఒంటి నిండా శూలాలు గుచ్చుకొని పూజలు చేస్తారు. 40 సంవత్సరాల క్రితం ఉపాధి కోసం తమిళనాడు నుంచి హిందూపురం పట్టణానికి వచ్చి స్థిరపడిన వారు చేసే ఈ విన్యాసాలు హిందూపురం వాసులను కట్టిపడేశాయి.
Tamils Festival In Anantapur: హిందూపురంలో ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు.. అది వారి ఆచారామంటా? - హిందూపురం తాజా వార్తలు
Tamils Festival In Anantapur: అక్కడి తమిళులు వినూత్న పద్ధతిలో వారి ఆరాధ్య దైవమైన సుబ్రమణ్య స్వామిని పూజిస్తారు. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో రథోత్సవం నిర్వహిస్తారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా శూలాలు గుచ్చుకొని మొక్కులు తీర్చుకుంటారు. మరి వారు చేసే విన్యాసాలను మనమూ చూద్దామా?
తమిళులు వారి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం తంగుని నక్షత్రం రోజున జరుపుకునే సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవాన్ని యధావిధిగా హిందూపురం పట్టణంలోనూ జరుపుకొంటారు. అదే రీతిలో ఈ ఏడాది శుక్రవారం రోజున సుబ్రమణ్య స్వామి రథోత్సవాన్ని నిర్వహించారు. తాము కోరిన కోర్కెలను నెరవేరిస్తే ఒంటినిండా చూలాలు గుచ్చుకుని రథోత్సవం నిర్వహిస్తామని మొక్కుకున్నారు. కోరిన మొక్కులు నెరవేర్చేందుకు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఒంటినిండా శూలాలు గుచ్చుకుని హిందూపురం పట్టణంలోని ప్రధాన వీధులలో రథోత్సవాన్ని నిర్వహించారు. మండుటెండలో పెద్దపెద్ద వాహనాలకు వేలాడుతూ కొనసాగిన ఈ రథోత్సవాన్ని చూసిన హిందూపురం వాసులు ఆశ్చర్యంగా తిలకించారు.
ఇదీ చదవండి: వ్యవసాయ పంపుసెట్లకు 'విద్యుత్ మీటర్లు'...మండిపడుతున్న రైతు సంఘాలు..