రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు కావాల్సిన సమాచారం, ఎరువులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాయని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో స్థానికి ఎమ్మెల్యే పద్మావతితో కలిసి ఆయన పర్యటించారు. సాంకేతిక పరిజ్ఞానంతో పండిస్తున్న అంజూర తోటలను పరిశీలించారు. అంజూరు పండ్లకు కావాల్సిన కోల్డ్ స్టోరేజీ, డ్రైస్టోరేజ్లను సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అందిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.
రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి: కన్నబాబు - రైతుభరోసాపై కన్నబాబు కామెంట్స్
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో మంత్రి కన్నబాబు పర్యటించారు. సాంకేతిక పరిజ్ఞానంతో పండిస్తున్న అంజూర తోటలను పరిశీలించి...రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
మంత్రి కన్నబాబు