పాత గొడవల కారణంగా తాడిపత్రిలోని వైకాపా కార్యకర్త నరేశ్ కారును అదే పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. కారు పగలగొట్టడానికి వెళ్తున్నారని ఓ వ్యక్తి... నరేశ్‌కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో నరేశ్ తన వర్గం కార్యకర్తలతో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే కారు అద్దాలు పగలగొట్టి, తిరిగి వెళ్తున్నవారిని నరేశ్ వెంబడించారు. ఆరుగురిలో ఇద్దరు దొరకటంతో, పోలీసులకు అప్పగించారు. ఈ దాడికి కారణాలపై నిందితులను విచారణ చేస్తున్న తాడిపత్రి పోలీసులు, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.
తాడిపత్రి వైకాపాలో అంతర్గత పోరు.. కార్యకర్త కారు ధ్వంసం - తెలుగు తాజా
అనంతపురం తాడిపత్రి వైకాపాలో అంతర్గత పోరుతో.. అదే పార్టీ కార్యకర్త కారును ధ్వంసం చేశారు. కారును ధ్వంసం చేసిన వారిలో ఇద్దరు పోలీసుల అధుపులో ఉన్నారు. మిగిలిన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
తాడిపత్రి వైకాపాలో అంతర్గత పోరు