ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరోసారి తెరపైకి తాడిపత్రి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వివాదం - Tadipatri Municipal Vice Chairman Abdul Rahim

Traffic police station: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మున్సిపల్ స్థలంలో కాకుండా మరోచోట నిర్మించాలని గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ ఆమోదంతో పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి మూడు చోట్ల స్థలాలు చూపించారు. కానీ వైసీపీ ప్రజాప్రతినిధులు, పోలీసులు పట్టుదలగా అక్కడే నిర్మాణం చేయటానికి భారీ పోలీసు బందోబస్తు మధ్య భూమిపూజ చేశారు. దీనిపై రెండు నెలల క్రితం మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రహీం హైకోర్టును ఆశ్రయించారు.

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్
Traffic police station

By

Published : Nov 30, 2022, 9:20 PM IST

Traffic police station: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. రూ.కోట్లు విలువ చేసే మున్సిపల్ స్థలంలో కాకుండా మరోచోట నిర్మించాలని గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ ఆమోదంతో పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి మూడు చోట్ల స్థలాలు చూపించారు.

కానీ స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు, పోలీసులు పట్టుదలగా అక్కడే నిర్మాణం చేయటానికి భారీ పోలీసు బందోబస్తు మధ్య భూమిపూజ చేశారు. దీనిపై రెండు నెలల క్రితం మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రహీం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో స్థలాన్ని రీ సర్వే చేయాలని కర్నూలులోని సర్వే శాఖ ఉన్నతాధికారికి ఆదేశాలిచ్చింది. సర్వే అధికారులు ఇవాళ పోలీస్ స్టేషన్ వద్ద స్థలాన్ని పరిశీలించి, కొలతలు వేశారు. దీనికి సంబంధించి అధికారులు కోర్టుకు సమర్పించటానికి నివేదిక తయారు చేస్తున్నారు. స్థలానికి సంబంధించిన పత్రాలను సంబంధిత న్యాయవాది సర్వే అధికారులకు అందజేశారు. పోలీసుల నుంచి స్థలానికి సంబంధించిన వివరాలు తీసుకున్నట్టు సమాచారం.

తాడిపత్రి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వివాదం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details