అనంతపురం జిల్లా తాడిపత్రిలోని టైలర్స్ కాలనీలో మృతి చెందిన భార్యాభర్తల ఇంటిని తెదేపా నియోజకవర్గ ఇంచార్జ్ జేసీ అస్మిత్ రెడ్డి సందర్శించారు. తల్లిదండ్రులు మరణించడం వల్ల అనాథలుగా మారిన చిన్నారులకు రూ. లక్ష విలువ గల చెక్కును అందించి ఆర్థిక సాయం అందజేశారు. చిన్నారులు పర్వీన్, మహబూబ్ బాషాలకు భవిష్యత్తులో అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. వారికి ఎటువంటి అవసరం వచ్చినా... తనని సంప్రదించాలని పిల్లలకు భరోసా ఇచ్చారు.
అనాథలైన చిన్నారులకు జేసీ అస్మిత్‌రెడ్డి చేయూత - అనంతపురం జిల్లా తాడిపత్రి తాజా వార్తలు
తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా మారిన చిన్నారులను తాడిపత్రి తెదేపా నియోజకవర్గ ఇంచార్జ్ జేసీ అస్మిత్ రెడ్డి పరామర్శించారు. చిన్నారులిద్దరికి ఒక్కొకరికి రూ.50 వేల చొప్పున చెక్కులను అందజేశారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా తనను సంప్రదించాలని తెలిపారు.
తాడిపత్రి తెదేపా నియోజకవర్గ ఇంచార్జ్ జేసీ. అస్మిత్ రెడ్డి