Tadipatri Police Gave Electric Shock For Dalit Youth: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు దళితులపై దాడులు అధికమవుతున్నాయి. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. తమకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన పాపానికి దళితులను పలు రకాలుగా బాధిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన ఓ దళిత యువకుడికి తాడిపత్రి పోలీసులు కరెంట్ షాక్ ఇచ్చిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
తాడిపత్రి పోలీసుల దాష్టీకం - దళిత యువకుడికి కరెంటు షాక్ జరిగిన సంఘటన ఇది: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం సీపీఐ కాలనీకి చెందిన రామ గురువయ్య అనే దళిత యువకుడు గత నెల (నవంబర్) 24వ తేదీన ఇద్దరు యువకులతో గొడవపడ్డాడు. ఇరువురిని పోలీస్ స్టేషన్‌కి పిలిపించిన పోలీసులు 25వ తేదీన గురువయ్య ముక్కు, చెవులకు కరెంట్ షాక్ ఇచ్చారు. దాంతో డ్రైవర్‌గా పని చేస్తున్న గురవయ్య చెయ్యి పనిచేయకపోవడంతో ఆసుపత్రిలో చేరారు. మెరుగైన వైద్యం కోసం గురువారం అనంతపురం జిల్లాలోని ఆస్పత్రికి వచ్చారు. తాడిపత్రి పోలీసులు కరెంటు షాక్ ఇవ్వడంతోనే తనకు ఈ దుస్థితి వచ్చిందని బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు.
YCP Leaders Attacked Businessman: పల్నాడు జిల్లాలో వైసీపీ 'గాడ్సే'లు.. కంపెనీ పెట్టిన ఎన్ఆర్ఐకి తీవ్ర ఇబ్బందులు.. కిడ్నాప్‌కు యత్నం
MRPS Leaders Fire on Tadipatri Police:ఈ ఘటనపై ఎమ్మార్పీఎస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసులు గొడవలు జరిగితే సర్ది చెప్పాలి కానీ కరెంట్ షాక్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కరెంటు షాక్ ఇచ్చిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. బాధితుడు గురవయ్యకు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారులు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Dalit Communities Leaders Fire on CM Jagan Regime: ''నా ఎస్సీ, నా ఎస్టీ'' అంటూ బహిరంగ సభల్లో ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై దళితులు, దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పాలనలో దళితులపై జరుగుతున్న దాడులపై ఆయన ఎందుకు స్పందించటం లేదని మండిపడుతున్నారు. జగన్ హయాంలో వారానికి నలుగురు దళితులు దారుణ హత్యలకు గురవుతున్నారని, ఆరుగురు హత్యాయత్నాలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కనీసం రోజుకు ఇద్దరు దళితులు దాడులకు బాధితులవుతున్నారని ధ్వజమెత్తారు. దళితులపై అఘాయిత్యాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దక్షిణ భారతదేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనకీర్తి వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కిందని దళిత నేతలు ఆరోపించారు.
'తిప్పారెడ్డి బోర్డు తిప్పేశాడు' రైతులను నిండాముంచిన వైసీపీ సర్పంచ్ కొడుకు - ₹15కోట్లతో అదృశ్యం
''నాకు, నా స్నేహితుల మధ్య చిన్న గొడవ జరిగింది. దాంతో పోలీసులు మమ్మల్ని తాడిపత్రి పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. మళ్లీ రెండు రోజుల తర్వాత నన్ను పట్టుకొని, ఎటువంటి విచారణ చేయకుండా నాకు కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. రెండు చెవులకు, ముక్కుకు కరెంట్ షాక్ ఇవ్వడంతో చెయ్యి, తలభాగం నొప్పిగా ఉంది. ప్రభుత్వం, అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలి.''- బాధితుడు రామ గురువయ్య
స్టేషన్‌కు పిలిచి దళిత యువకుడిని కొట్టిన పోలీసులు - తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం