JC PRABHAKAR ON ED : BS-3 వాహనాలను BS-4గా రిజిస్ట్రేషన్ చేసిన కేసులో ఈడీ విచారణ.. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశమని టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఇప్పుడే కేసు అసలైన రూట్లో వెళ్తోందని.. ఇందులో అందరూ ఇరుక్కుని.. తాను నిర్దోషిగా బయటకు వస్తానన్నారు.
ఈడీ విచారణ.. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశం: జేసీ - ఈడీ అటాచ్‌మెంట్‌పై జేసీ ప్రభాకర్‌రెడ్డి
JC PRABHAKAR REACTS ON ED ENQUIRY : ఈడీ ఇచ్చిన ప్రెస్‌నోట్ చూశాక ఆనందంగా ఉందని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఈడీ విచారణ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోడానికి వచ్చిన అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడే కేసు అసలైన రూట్లో వెళ్తోందని.. ఇందులో అందరూ ఇరుక్కుని.. తాను నిర్దోషిగా బయటకు వస్తానన్నారు.
JC PRABHAKAR ON ED
ఇందులో ముందుగా తనకు వాహనాలు అమ్మిన అశోక్ లేలాండ్‌ను ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. కాస్త ఆలస్యంగా నైనా అశోక్ లేలాండ్ వారిని ఇందులో చేర్చడం సంతోషమన్నారు. ఇందులో నాగాలాండ్ అధికారులు, పోలీసులు, ఆర్టీఓ అధికారులు అందరూ ఇరుక్కుంటారని జేసీ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తనకు సంతోషించదగ్గ విషయం అన్నారు.
ఇవీ చదవండి: