JC Prabhakar Reddy : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పింఛన్లు ఇవ్వలేకనే పేర్లు తొలగించి అర్హులైన పేదలకు అన్యాయం చేస్తున్నారని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. పింఛన్ తొలగించరాని మనోవ్యధతో తాడిపత్రి ఆసుపత్రిలో చేరిన రహమత్ అనే వ్యక్తిని ఆయన పరామర్శించారు. కనీస విచారణ చేయించకుండా ఏకపక్షంగా పింఛన్లను తొలగించటం చాలా అన్యాయమని మండిపడ్డారు. లబ్దిదారులకు పింఛన్ తొలగించటానికి గల కారణాలు అధికారులు చెప్పటం లేదని అన్నారు.
పింఛన్లు ఇవ్వలేకనే పేర్లు తొలగింపు: జేసీ ప్రభాకర్ రెడ్డి - తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్
JC Prabhakar Reddy : మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఇవ్వలేదని.. ఇప్పుడు పింఛన్లు తొలగించారని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఇలా పింఛన్లు తొలగిస్తే పేదలు రోడ్డున పడతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి
"ఎన్నికల సమయంలో ఎవో మాటలు చెప్పావు. మూడు వేల రూపాయలు ఇస్తానని.. 2500 ఇచ్చావు. ఇప్పుడు 250 రూపాయలు పెంచేసరికి మీకు బరువైంది. తాడిపత్రి మున్సిపాలిటీలో దాదాపు 1148 పింఛన్లు తొలగించారు. దీంతో ప్రభుత్వం ఒక్క తాడిపత్రిలోనే సుమారు 45 నుంచి 50 లక్షల రూపాయలు తప్పించుకుంది. ఇలా హఠాత్తుగా తొలగిస్తే వృద్ధులు ఆవేదనకు లోనవుతారు." -జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్
ఇవీ చదవండి: