అనంతపురం జిల్లా యల్లనూరు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యక్తిగత పనుల కోసం యల్లనూరుకు వెళ్లిన ఆయన...తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లి హడావుడి చేశారు. ఎమ్మార్వో కుర్చీలో కూర్చొని.. ఆలస్యంగా వచ్చిన అధికారులపై మండిపడ్డారు. తన నియోజకవర్గం కాకపోయినా వెళ్లి మేజిస్ట్రేట్ హోదా అయిన తహసీల్దార్ కుర్చీలో కూర్చోవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తీవ్ర చర్చనీయాంశంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి తీరు - తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వార్తలు
అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి... యల్లనూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో హడావుడి చేశారు. కార్యాలయంలోని ఎమ్మార్వో కుర్చీలో కూర్చొని ఆలస్యంగా వచ్చిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం కాకపోయినా ఆయన ఇలా చేయటం చర్చనీయాంశమైంది.
MLA kethireddy pedda reddy