ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల కోడ్​ అధికార పార్టీకి వర్తించదా..? - Tadipatri MLA Kethereddy Peddara Reddy latest comments

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో అధికార పార్టీ నాయకులకు ఈ కోడ్​ వర్తించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం పేరుతో 300 మంది దివ్యాంగులకు వైకాపా నేతలు చీరలు పంపిణీ చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే కావడం వల్లే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Tadipatri MLA Kethereddy Peddara Reddy
దివ్యాంగులకు చీరల పంపిణీ చేస్తున్న తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి

By

Published : Mar 9, 2020, 7:43 PM IST

దివ్యాంగులకు చీరలు పంపిణీ చేస్తున్న తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details