ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తాడిపత్రి ఘటన' నిందితులకు 14 రోజుల రిమాండ్ - తాడిపత్రి ఘటన నిందితులకు రిమాండ్

తాడిపత్రి ఘటన నిందితులకు గుత్తి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితులకు కరోనా పరీక్షలు నిర్వహించి...గుత్తి సబ్​జైల్​కు తరలించారు.

'తాడిపత్రి ఘటన' నిందితులకు 14 రోజుల రిమాండ్
'తాడిపత్రి ఘటన' నిందితులకు 14 రోజుల రిమాండ్

By

Published : Dec 31, 2020, 9:00 PM IST

తాడిపత్రి ఘటనలో ఎమ్మెల్యే కేతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ వర్గాలకు చెందిన 10 మందిపై స్థానిక డీఎస్పీ చైతన్య కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇరువర్గాలకు చెందిన నిందితులను గుత్తి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్​ను విధించారు. వీరికి కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం గుత్తి సబ్​జైల్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details