అనంతపురం జిల్లాలోని పెనుకొండలో స్వచ్ఛ భారత్ కార్మికులు వేతనాలు కోసం ధర్నాకు దిగారు. 8 నెలలుగా వేతనం చెల్లించడంలేదని, తాము తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని 'స్పందన' కార్యక్రమంలో ఉన్నా బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణకు వినతిపత్రం అందజేశారు. సంబందిత అధికారితో చర్చించిన మంత్రి, వినాయక చవితి కంటే ముందుగానే కార్మికులకు వేతనాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ నిరసన కార్యక్రమానికి సీపీఎం, సీఐటీయు మద్దతు ఇచ్చింది.
వేతనాలకోసం స్వచ్ఛ భారత్ కార్మికుల ధర్నా - citu
అనంతపురం జిల్లా పెనుకొండలో స్వచ్ఛ భారత్ కార్మికులు ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. తమకు 8 నెలలుగా బకాయిపడిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
swachh bharat workers dharna under cpi citu in ananrhapuram district