పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. స్వచ్ఛభారత్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా అధునాతన యంత్రాలు సమకూర్చాయి. 2015-16 నుంచి అన్ని మున్సిపాలిటీలకు సరఫరా చేశాయి. వాటిలో రోడ్లపై చెత్త ఊడ్చేందుకు స్వీపింగ్ మిషన్లు, రోడ్లను శుభ్రం చేయడానికి అనువుగా చిన్న యంత్రాలు, చెత్త తరలించేందుకు కాంపాక్టర్లు, కాలువల్లో పూడిక తీయడానికి చిన్న జేసీబీలు, చెత్తకుండీలు కొనుగోలు చేశారు. వీటికి రూ.లక్షలు ఖర్చు చేశారు. ఈ యంత్రాలను నగర, పురపాలక సంఘాలు సక్రమంగా వినియోగించడం లేదు. కొన్ని మున్సిపాలిటీల్లో తుప్పుపడుతున్నాయి. మరోవైపు స్వచ్ఛత పనులు సాగడంలేదు. ఇటీవల ప్రకటించిన స్వచ్ఛత ర్యాంకుల్లో కొన్ని మున్సిపాలిటీలు వెనుకబడ్డాయి.
వృథాగా వదిలేశారు..
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మున్సిపాలిటీలకు యంత్రాలు సరఫరా చేశారు. మరోవైపు అనంతపురం, తాడిపత్రి వంటి స్థానికసంస్థలు ఆయా పరిస్థితులను బట్టి అవసరమైన యంత్రాలు కొనుగోలు చేశాయి. నగరపాలకసంస్థ రూ.30 లక్షలతో మరో స్వీపింగ్ యంత్రం కొనుగోలు చేసింది. తాడిపత్రిలో కాలువలు శుభ్రం చేయడానికి రోబోను కొనుగోలు చేశారు. ఇతర మున్సిపాలిటీల్లో జేసీబీలు, ట్రాక్టర్లు, కాంపాక్టర్లు తెప్పించారు. కొనుగోలు చేసిన కొత్తలో వాటిని ఉపయోగించారు. ఆ తరువాత వాటి గురించి పట్టించుకోవడం మానేశారు.
గుత్తేదారు నిర్వాకం