శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం గుమ్మపాడు గ్రానైట్ క్వారీలో పని చేస్తున్న ఓ యువకుడి మృతదేహం చెట్టుకు వేలాడుతూ ఉండటంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందచేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన యువకుడు ఒడిశా వాసిగా గుర్తించారు. ఇది హత్యా లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చెట్టు కొమ్మకు యువకుడి మృతదేహం..మృతిపై అనుమానాలు - గుమ్మపాడు అనుమానస్పద మృతి న్యూస్
శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం గుమ్మపాడు సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో ఒడిశాకు చెందిన యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు.
![చెట్టు కొమ్మకు యువకుడి మృతదేహం..మృతిపై అనుమానాలు suspiciously dead](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8327481-365-8327481-1596792138145.jpg)
అనుమానస్పదంగా యువకుడు మృతి