ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బెంగుళూరులో అనంత జిల్లా మహిళ అనుమానాస్పద మృతి - Suspicious death of a woman in ananthapuram district

అనంతపురం జిల్లా కేశవాపురం గ్రామానికి చెందిన ఓ మహిళ బెంగుళూరులో అనుమానాస్పదంగా చనిపోయింది. బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Suspicious death of a woman in Bangalore
బెంగుళూరులో మహిళ అనుమానాస్పద మృతి

By

Published : Jul 28, 2020, 7:52 PM IST

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కేశవాపురం గ్రామంలో మల్లికార్జున్ అనే వ్యక్తి కుటుంబ పోషణ కోసం బెంగళూరుకు వలస వెళ్లాడు. మూడు రోజుల క్రితం అతని భార్య అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతదేహాన్ని మూడు రోజులు అక్కడే ఉంచారు. చివరికి సొంత గ్రామం కేశవాపురానికి తీసుకువచ్చారు. గ్రామానికి చేరుకున్న తర్వాత మృతిరాలి భర్త, అత్త, మామ పరారయ్యారు. భర్త, అత్త, మామ కలిసే తన కూతురిని చంపి, విద్యుదాఘాతంతో చనిపోయినట్లు చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. బెంగుళూరులో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details