అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం జీ. కొట్టాలలో ఒక వ్యక్తి మృతదేహం అనుమానాస్పద స్థితిలో శ్మశానంలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారమివ్వగా వారు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఆ వ్యక్తిది ఆత్మహత్య, హత్యా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
శ్మశానంలో మృతదేహం.. హత్యా..? ఆత్మహత్యా..? - అనంతపురం జిల్లా కొట్టాలలో వ్యక్తి అనుమానాస్పద మృతి వార్తలు
మామూలుగా మనిషి చనిపోయాక అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకెళ్తారు. అక్కడ దహన సంస్కారాలు నిర్వహించి మరణించిన వారి ఆత్మకు శాంతి కలిగేలా చేస్తారు. అయితే ఒక వ్యక్తి మృతదేహం శ్మశానంలో అనుమానాస్పద రీతిలో పడి ఉన్న ఘటన అనంతపురం జిల్లా జీ.కొట్టాలలో జరిగింది. అతనిది హత్యా, ఆత్మహత్యా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతి
జీ. కొట్టాలకు చెందిన వెంకటరాముడు, ధనలక్ష్మి భార్యాభర్తలు. గత రాత్రి వారిద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలో వెంకటరాముడు ఇంట్లో ఉరివేసుకుని మృతిచెందాడు. అతని మృతదేహం శ్మశానంలో కనిపించింది. మృతుని శరీరంపై అక్కడక్కడా గాయాలుండటంతో.. శవపరీక్ష ఫలితాలు వచ్చాక అది ఆత్మహత్య, హత్య అనే విషయం తెలుస్తుందని చెప్పారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి... సాయం చేస్తానంటూ వచ్చి... సొమ్ము కాజేసేవాడు!