ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండో రోజూ కొనసాగిన ఆంధ్ర-కర్ణాటక సరిహద్దుల గుర్తింపు - సర్వే ఆఫ్ ఇండియా గుర్తించనున్న ఏపీ, కర్ణాటక సరిద్దులు

ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులు గుర్తించడానికి.. సర్వే ఆఫ్ ఇండియా రెండో రోజూ ప్రయత్నాలు కొనసాగించింది. ఇరు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. సోమవారం మరికొన్ని ప్రాంతాలను గుర్తించనున్నట్లు వెల్లడించారు.

inter state boundaries identification
ఏపీ, కర్ణాటక సరిహద్దుల గుర్తింపు

By

Published : Oct 18, 2020, 7:27 AM IST

రెండో రోజూ ఆంధ్ర-కర్ణాటక సరిహద్దుల గుర్తింపు కొనసాగింది. అనంతపురం జేసీ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో సర్వే ఆఫ్ ఇండియా అధికారులు అంతర్రాష్ట్ర సరిహద్దులను పరిశీలించారు. కర్ణాటకలోని విఠలాపుర, గంగులాపుర, తుమిటి గ్రామాల వద్ద హద్దులను తనిఖీ చేశారు. అలకుంది సమీపంలోని బ్లాక్ గోల్డ్ గనుల మద్యలోని రాక్ పాయింట్​లను గమనించారు.

సోమవారం నుంచి మూడు బృందాలుగా ఏర్పడి.. ఆంధ్ర, కర్ణాటకల్లోని సరిహద్దులను సర్వే ఆఫ్ ఇండియా గుర్తించనుంది. ఏపీలోని ఓబులాపురం, సిద్దాపురం, మలపనగుడి పరిధిలో గనుల ప్రాంతాల్లో హద్దులను గుర్తించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నూతన గదుల ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details