Supreme Court Judge Rama subramanian visited Puttaparthi Prasanthi Nilayam: అనంతపురం జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా మహా సమాధిని సుప్రీం కోర్టు జడ్జి రామసుబ్రమణ్యన్ దంపతులు దర్శించుకున్నారు. ముందుగా.. ప్రశాంతి భవన్ అతిథి గృహం వద్ద రామసుబ్రమణ్యన్కు.. జిల్లా జడ్జి, ట్రస్ట్ ఆర్గనైజింగ్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమేశ్ పాండే స్వాగతం పలికారు. సాయి కుల్వంత్ సభ మందిరంలో భగవాన్ సత్య సాయి బాబా సమాధిని దర్శించుకొని ఆయన సేవలను స్మరించుకున్నారు.
దర్శనానంతరం సత్యసాయి బాబా ట్రస్టు సభ్యులతో మాట్లాడారు. ట్రస్టు ద్వారా దేశవిదేశాల్లో అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ మానవాళికి అందించిన సేవల పరమార్థాన్ని తెలియజేసిన భగవాన్ సత్య సాయిబాబా మహా సమాధిని దర్శించుకోవడం సంతోషకరంగా ఉందని రామ సుబ్రమణ్యన్ అన్నారు. బాబా శివైక్యం పొందినా.. సేవలు కొనసాగిస్తుండటం ప్రశంసనీయమని కొనియాడారు.