అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని రాయంపల్లి గ్రామంలో ఉన్న పురాతన రామలింగేశ్వర స్వామి శివాలయంలో అద్భుత ఘటన చోటుచేసుకుంది. శివలింగాన్ని గురువారం ఉదయం సూర్య కిరణాలు తాకాయి. ఉదయం అర్చకుడు గుడి తలపులు తెరవగానే ఈ అద్భుత దృశం కనిపించిందని తెలిపారు. ఏటా ఈ మాసంలో ఏదో ఒకరోజు రవి కిరణాలు ఈశ్వరుని విగ్రహం మీద పడుతుంటాయని గ్రామస్థులు తెలిపారు. అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూడ్డానికి గ్రామస్థులు ఆలయానికి తరలివచ్చారు.
అద్భుత దృశ్యం.. శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు - Sunbeams touched Shivalingam
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని రాయంపల్లి గ్రామంలో ఉన్న పురాతన రామలింగేశ్వర స్వామి శివాలయంలో అద్భుత ఘటన జరిగింది. శివలింగాన్ని గురువారం ఉదయం సూర్య కిరణాలు తాకాయి.

శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు