అనంతపురం జిల్లా ధర్మవరంలోని శ్మశానంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు రాజేంద్ర(30)శ్మశాన వాటికలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. శ్మశాన వాటికకు వెళ్లిన స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించుకునే రాజేంద్రకు రూ 3 లక్షలకు పైగా అప్పులు ఉన్నట్లు స్థానికులు.. పోలీసులకు తెలిపారు. మృతునికి భార్య కృష్ణవేణి తల్లి సుశీలమ్మ ఉంది. కొద్ది రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లడంతో... రాజేంద్ర ఒంటరిగానే ఉంటున్నాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పనులు లేకపోవడం.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో ...బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. రాజేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
శ్మశానంలో ఉరి వేసుకుని యువ చేనేత కార్మికుడి ఆత్మహత్య - ధర్మవరం తాజా వార్తలు
ఆర్థిక ఇబ్బందుల తట్టుకోలేక యువ చేనేత కార్మికుడు శ్మశానంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో జరిగింది.

శ్మశానంలో ఉరేసుకుని యువ చేనేత కార్మికుడి ఆత్మహత్య