అనంతపురంలోని రామచంద్ర అనే వ్యక్తి శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగర శివారులోని రామకృష్ణ కాలనీకి చెందిన రామచంద్ర పెయింటింగ్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిస అయ్యాడు. దీంతో భార్య కూడా రామచంద్రను వదిలి వెళ్లి పోయిందని బంధువులు తెలిపారు. మానసికంగా ఇబ్బంది పడుతున్న రామచంద్ర రాత్రి శానిటైజర్ తాగడంతో కడుపు నొప్పి వచ్చిందని.. ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలోనే మృతి చెందినట్లు బంధువులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురంలో శానిటైజర్ తాగి వ్యక్తి ఆత్మహత్య - ananthapuram district
ఒక వ్యక్తి శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది.
![అనంతపురంలో శానిటైజర్ తాగి వ్యక్తి ఆత్మహత్య ananthapuram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8203436-991-8203436-1595929607669.jpg)
శానిటైజర్ తాగి వ్యక్తి ఆత్మహత్య