అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం మాగేచెరువు శివారులో విద్యుదాఘాతంతో... చాలాకూరు గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే కూలీ విద్యుత్ మరమ్మతుల కోసం స్తంభం ఎక్కాడు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రభాకర్ మరమ్మతులు చేస్తున్న 11కేవీ లైన్‌కి విద్యుత్ ఒక్కసారిగా సరఫరా అయ్యింది.
ఒక్కసారిగా విద్యుత్ సరఫరా.. షాక్‌తో వ్యక్తి మృతి - man with the power supply died at magepally
ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరిగిన కారణంగా... అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని మాగేచెరువు శివారులో కూలీ మృతి చెందాడు.
ఒక్కసారిగా విద్యుత్ సరఫరాతో వ్యక్తి మృతి
ప్రభాకర్ విద్యుదాఘాతానికి గురై విద్యుత్ స్తంభం నుంచి కిందపడి అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని చేరుకున్నారు. ప్రభాకర్ మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోమందేపల్లి ఎస్సై వెంకటరమణ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
TAGGED:
ananthapur newsupdates