రైలు కిందపడి మహిళ ఆత్మహత్య
రైలు కిందపడి మహిళ ఆత్మహత్య - sucide-on-railway-track
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం యళ్ళనూరు రోడ్డు రైల్వే గేటు సమీపంలో రైలు కిందపడి మహిళ ఆత్మహత్య చేసుకుంది. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

RAIL
అనంతపురం జిల్లాలోని యళ్లనూరులో రైలు కిందపడి 51 ఏళ్ల లక్షీదేవి ఆత్మహత్యచేసుకుంది. పట్టణంలోని జయనగర్ కాలనీకి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున రైల్వే గేటు వద్దకు వచ్చి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.