అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామంలో సుబ్రమణ్యేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని సుందరంగా అలంకరించి వేద మంత్రాలతో కల్యాణం జరిపారు. దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ దేవాలయం ఆధ్యాత్మికంగా చాలా విశిష్టమైనదని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నెల 11 తేదీన అష్టోత్తర కలశాభిషేకం నిర్వహిస్తున్నామని ఆలయ అధికారి సుధారాణి తెలిపారు.
కన్నుల పండుగగా.. సుబ్రమణ్యేశ్వర స్వామి కల్యాణం - subrahmanya swami mahostavas
అనంతపురం జిల్లా పంపనూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం కన్నుల విందుగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కన్నుల పండుగగా సుబ్రమణ్యేశ్వర స్వామి కల్యాణం