కర్ణాటకలోని తుంకూర్ జిల్లా పావగడ తాలూకాలోని జాలేడు గ్రామం నుంచి అక్రమంగా మన రాష్ట్రానికి ఇద్దరు వ్యక్తులు మద్యం సరఫరా చేస్తున్నారు. వారి వద్ద నుంచి 50 వేల రూపాయలు లంచం తీసుకున్నారని విచారణలో తేలడంతో.. ఎస్సైలు జిలాన్ బాషా, శివప్రసాద్ లతోపాటు కానిస్టేబుళ్లు మోహన్, మురళీకృష్ణలను అరెస్టు చేసినట్లు ఎస్పీ రామ్ మోహన్ తెలిపారు.
మద్యం వ్యవహారంలో ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్ - అనంతపురంలో ఇద్దరు ఎస్సైలు అరెస్టు న్యూస్
2 రోజుల క్రితం కర్ణాటకలో జరిగిన మద్యం వ్యవహారంలో అనంతపురం జిల్లా కంబదూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు చెందిన ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుళ్లను జ్యుడీషియల్ రిమాండ్ కు పంపినట్లు అడిషనల్ ఎస్పీ రామ్ మోహన్ రావు తెలిపారు.

subinspectors and constables arrested in liquour case at ananthapuram