అనంతపురం జిల్లా సొమందేపల్లి మండలంలోని నక్కలగుట్టలో ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించాలని కోరుతూ సోమవారం పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకులు, ఇళ్ల స్థలాల లబ్ధిదారులు ఆందోళన చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు నక్కలగుట్టలోని ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించేదాకా కదలబోమని అక్కడే కూర్చున్నారు. సబ్‌కలెక్టర్ బయటకు వచ్చి సమస్య పరిష్కరించాలని, నక్కలగుట్టలో పోలీస్ పికెటింగ్ తొలగించాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసి కార్యాలయంలో ఉన్న సబ్ కలెక్టర్ నవీన్ ఆందోళనకారుల వద్దకు వచ్చారు. ఆయన కూడా ఎండలోనే ఆందోళనకారుల ఎదుట నేలపై 15 నిమిషాలకు పైగా కూర్చొని వారి సమస్యను సానుకూలంగా విన్నారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీనిచ్చారు.
నేలపై కూర్చొని సమస్యలు విన్న సబ్‌కలెక్టర్ - అనంతపురం జిల్లా వార్తలు
అనంతపురం జిల్లా సొమందేపల్లి మండలంలోని నక్కలగుట్టలో ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించాలని కోరుతూ సోమవారం పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకులు, ఇళ్ల స్థలాల లబ్ధిదారులు ఆందోళన చేశారు. విషయం తెలిసి కార్యాలయంలో ఉన్న సబ్ కలెక్టర్ నవీన్ ఆందోళనకారుల వద్దకు వచ్చారు. ఆయన కూడా ఎండలోనే ఆందోళనకారుల ఎదుట నేలపై 15 నిమిషాలకు పైగా కూర్చొని వారి సమస్యను సానుకూలంగా విన్నారు.
నేలపై కూర్చొని సమస్యలు విన్న సబ్‌కలెక్టర్