ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

rain problems: ఆ కాలనీకి వెళ్లాలంటే గోడెక్కాల్సిందే! - rains

వర్ష ప్రభావానికి ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఓ ప్రాంతంలో రోడ్డు పాడవడటంతో.. గత్యంతరం లేక విద్యార్థులు.. ఉపాధ్యాయులు గోడమీదనుంచి ఇంటికి వెళుతున్నారు. పక్కనే ట్రాన్స్​ఫార్మర్ ఉన్నా వారేం చేయలేని దుస్థితి. రోజూ.. బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నారు.

students  went   home by walk  on wall at uravakonda
ఉరవకొండలో విద్యార్థుల అవస్థలు

By

Published : Jul 23, 2021, 9:11 AM IST

ఉరవకొండలో విద్యార్థుల అవస్థలు

దారి ఉన్నా ప్రమాదకరంగా గోడెక్కి వెళ్లాల్సిన దుస్థితి అనంతపురం జిల్లా ఉరవకొండలో నెలకొంది. పట్టణంలోని వీరశైవనగర్‌కు ప్రధాన రహదారి నుంచి మార్గం లేదు. కాలనీవాసుల వినతి మేరకు ప్రజాప్రతినిధులు 5 నెలల కిందట స్థానిక విద్యుత్తు కార్యాలయ ప్రాంగణం పక్కగా రోడ్డు వేశారు. దారి నిర్మాణంలో మొత్తం బంక మట్టిని వాడారు. ఇంకేం.. వర్షాలకు ఆ మట్టి బురదలా మారి అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. కాళ్లకు బురద అంటుకొని వదలడం లేదు. చెప్పులు అందులోనే ఇరుక్కుపోతున్నాయి. బురద తక్కువ ఉన్నచోట అడుగేస్తే జారుతోంది.

దీంతో ఆ మార్గంలో డిగ్రీ కళాశాలకు వెళ్తున్న యువతులు..గత్యంతరం లేక విద్యుత్తు కార్యాలయ ప్రహరీ ఎక్కి వెళుతున్నారు. ఆ గోడ పక్కనే ట్రాన్స్‌ఫార్మర్‌ ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దలు మాత్రం ఆటోలో రెండున్నర కిలోమీటర్లు తిరిగి ప్రధాన రోడ్డుకు చేరుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details