ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదకరమైన ప్రయాణం.. పట్టు జారితే అంతే - ananthapuram district latest updates

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని పలు గ్రామాల్లో బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. ఒకే ఆటోలో 20మందికి పైగా ప్రయాణిస్తున్నారు.

ఆటోలో వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న విద్యార్థులు
ఆటోలో వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న విద్యార్థులు

By

Published : Mar 4, 2021, 4:22 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని పలు గ్రామాల్లో బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకే ఆటోలో 20 మందికి పైగా ప్రయాణించడం వల్ల ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గురువారం ఉదయం కొంతమంది విద్యార్థులు ఒక ఆటోలో వెనుక వేలాడుతూ ప్రయాణించారు. ఏ ప్రమాదం జరగక ముందే అధికారులు వెంటనే స్పందించి బస్సులు లేని గ్రామాలకు బస్సులు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details