Students problems: అనంతపురం జిల్లాలోని చిరంజీవి రెడ్డి కళాశాలలో.. జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులకు గందరగోళ పరిస్థితి నెలకొంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా అప్పటికప్పుడు పరీక్షా కేంద్రాన్ని మార్చడంతో ఆందోళనకు గురయ్యారు. సీఆర్ఐటీ కళాశాలలో పరీక్ష జరగాల్సి ఉండగా.. పలు సాంకేతిక కారణాలతో పరీక్ష కేంద్రాన్ని జేఎన్టీయూ అనంతపురానికి మార్చారు. దీనివలన సూదూర ప్రాంతాల నుంచే వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పరీక్ష నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రం మార్పు.. విద్యార్థుల ఇబ్బందులు - జేఈఈ మెయిన్స్ పరీక్షలో విద్యార్థులకు గందరగోళం
Students problems: అనంతపురం జిల్లాలోని చిరంజీవి రెడ్డి కళాశాలలో.. జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులకు గందరగోళ పరిస్థితి నెలకొంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా అప్పటికప్పుడు పరీక్షా కేంద్రాన్ని మార్చడంతో ఆందోళన చెందారు.

జేఈఈ మెయిన్స్ పరీక్షలో విద్యార్థులకు గందరగోళం
పోటీ పరీక్షలకు ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలుకు అనుమతించని నిర్వాహకులు.. దీనికి ఏం సమాధానం చెబుతారని వారు ప్రశ్నించారు. జేఎన్టీయూ ప్రిన్సిపల్ సుజాత దీనిపై సమాధానం ఇస్తూ.. సీఆర్ఐటి కాలేజీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సమన్వయ లోపం వల్ల ఈ సమస్య తలెత్తిందని చెప్పారు.
జేఈఈ మెయిన్స్ పరీక్షలో విద్యార్థులకు గందరగోళం
ఇవీ చూడండి:
TAGGED:
ap latest news