అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో బాలికల వసతి గృహాన్ని శ్మశాన వాటిక పక్కన నిర్మించవద్దని.. ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, రాష్ట్ర విద్యా సంస్కరణల కమిటీ సీఈవో సాంబశివారెడ్డి కారును అడ్డగించారు. నార్పలలో ఓ ఆసుపత్రి ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యేను ఏబీవీపీ నాయకులు అడ్డగించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. శ్మశానం పక్కన హాస్టల్ నిర్మాణం ఆపాలని అధికారులకు వినతిపత్రం ఇచ్చినా.. పట్టించుకోలేదని వారు వాపోయారు. విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. పరిస్థితి అదుపులోకి రాకపోయేసరికి, ఎమ్మెల్యే కారు దిగి సర్దిచెప్పారు.
ఎమ్మెల్యే కారును అడ్డగించిన విద్యార్థి సంఘాల నాయకులు - mla jonnalagadda padmavathi latest news
ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రయాణిస్తున్న కారును ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు అడ్డగించారు. శ్మశానం పక్కన హాస్టల్ భవనాన్ని నిర్మించవద్దని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కారును అడ్డగించిన విద్యార్థి సంఘాల నాయకులు
ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కారును అడ్డగించిన విద్యార్థి సంఘాల నాయకులు