పాఠశాలల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని... డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అనంతపురం జిల్లా హిందూపురం ఆర్టీసీ బస్ డిపో ముందు బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల్లోని పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సమయానికి బస్సులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని ఆవేదన చెందారు. పలుమార్లు డిపో అధికారికి విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో నిరసన బాట పట్టాల్సి వచ్చిందని విచారణ వ్యక్తం చేశారు.
'విద్యాలయాలకు అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలి' - హిందూపురం తాజా వార్తలు
విద్యాలయాల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని... డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల్లోని పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు సమయానికి బస్సులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని ఆవేదన చెందారు.
విద్యాలయాలకు అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలి
సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. డిపో అధికారి విద్యార్థుల వద్దకు వచ్చి వారు కోరిన విధంగా బస్సులను నడుపుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఇదీ చదవండీ...విశాఖ 'విక్టరీ ఎట్ సీ' వద్ద అమర జవాన్లకు నివాళులు